జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ శివప్రసాద్ తెలిపారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారని తెలిపారు.