ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునపారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. జమ్మలమడుగు రోడ్డులోని ప్రధాన కాలువ నుండి మడూరు చానల్ వరకు కాలువలో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేశారు. కేసన్న సత్రం వీధి, శాస్త్రీయ నగర్, వైయస్ నగర్ ప్రాంతాల్లో కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా పాల్గొన్నారు.