ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆటోనగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను శుక్రవారం తహశీల్దార్ గంగయ్య సీజ్ చేశారు. గోడౌన్ తాళాలు పగలగొట్టి రూరల్ పోలీసులు, రెవెన్యూ అధికారులు పంచనామా చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని టెస్టింగ్ కు పంపిస్తున్నామని పీడీఎస్ బియ్యం అని తేలితే 6ఏ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు.