ప్రొద్దుటూరు: ఆ కౌన్సిల్ సమావేశానికి చట్టబద్ధత లేదు

82చూసినవారు
ప్రొద్దుటూరు: ఆ కౌన్సిల్ సమావేశానికి చట్టబద్ధత లేదు
జనవరి 31న జరిగిన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి చట్టబద్ధత లేదని మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు. బడ్జెట్ సమావేశం తర్వాత సాధారణ సమావేశాన్ని ఈ నెల 21కి వాయిదా వేశానని పేర్కొన్నారు. తాను వాయిదా వేసినా. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారన్నారు. ఆ సమావేశంలో ఆమోదించిన అజెండాను రద్దు చేయాలని కలెక్టర్, ఆర్డీడీకి ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్