ప్రొద్దుటూరు స్థానిక పశువైద్య కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిశీలకులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సాహత్పురే ఈనెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు సాధరణ తనిఖీలు నిర్వహించారు. కళాశాలలోని వివిధ విభాగాలను, పశు చికిత్సాలయం, పశుగణక్షేత్ర సముదాయాలు, విద్యార్ధుల వసతి గృహాలు, క్రీడావిభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. వారి వెంట కళాశాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.