ప్రొద్దుటూరు స్థానిక శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశ్ పాండే స్కిల్ వారితో ఎంఓయూ కుదుర్చుకుందని కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ తెలిపారు. కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కళాశాల డైరెక్టర్ పృధ్వీనారాయణ, పర్లపాడు గౌరీశంకర్, , శారదభవాని పాల్గొన్నారు.