ఎమ్మెల్యే వరద కు మంత్రి పదవి రావాలని దర్గాలో పూజలు

82చూసినవారు
ఎమ్మెల్యే వరద కు మంత్రి పదవి రావాలని దర్గాలో పూజలు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజుల రెడ్డి 6 సారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం సత్యసాయి జిల్లాలోని పెనుగొండలో వెలసిన శ్రీ హజరత్ బాబా ఫక్రుద్దీన్ స్వామి దర్గా నందు వరదరాజుల రెడ్డి మంత్రి కావాలని ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ టప్పా బాషా, గఫార్, వెలవల్లి ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్