ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పు మాలలకు నష్టదాయకమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్ విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరు పాతబస్టాండ్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై జాతీయస్థాయిలో పోరాడతామని, తీర్పు రివ్యూ చేయాలని పిటిషన్ వేస్తామన్నారు.