ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్దయ్య ప్రజలకు సూచించారు. శుక్రవారం తొండూరు మండలం యాదవవారిపల్లె గ్రామంలో ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వాల సర్వే నిర్వహించి మలేరియా, డెంగీ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.