చక్రాయపేట: గండి నిత్యాన్నదానానికి దాత విరాళం

52చూసినవారు
చక్రాయపేట: గండి నిత్యాన్నదానానికి దాత విరాళం
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నిత్యాన్నదానానికి దాత విరాళం అందజేసినట్లు ఇఓ జె. వెంకటసుబ్బయ్య తెలిపారు. మంగళవారం ప్రోద్దుటూరుకు చెందిన దాత వెంకటరెడ్డి, కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ. 50, 116 లు అర్చకుడు కేసరిస్వామి, మాజీ ఛైర్మన్ వెంకటస్వామిలకు అందజేశారు. నిత్యాన్నదాన అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తోడ్పాటు అందించాలని ఇఓ కోరారు.

సంబంధిత పోస్ట్