కర్ణపాపాయ పల్లెలో అరటి తోట దగ్ధం

64చూసినవారు
కర్ణపాపాయ పల్లెలో అరటి తోట దగ్ధం
లింగాల మండలం కర్ణపాపాయపల్లెలో రైతు ఎం. అంకాల్ రెడ్డికి చెందిన రెండు ఎకరాల అరటి తోటకు సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తోటలోని అరటి చెట్లు దగ్ధం కావడంతోపాటు డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. దీంతో రైతుకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు వాపోయారు. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్