కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత జిల్లాలో మంగళవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆమె పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు గ్రామంలోని సంక్షేమ గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో కలిసి సందర్శించారు. పాఠశాలలో రికార్డులను, వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను, బాగోగులను అడిగి
తెలుసుకున్నారు.