పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, కమిషనర్ రాముడు, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ఎంఈవో నాయుడు, ఉపాధ్యయులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు.