పులివెందుల: చెవి నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

58చూసినవారు
పులివెందుల: చెవి నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డుసమీపంలో ఉన్న జయమ్మ కాలనీలో నివాసముంటున్న సంజీవరాయుడు అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. సంజీవ రాయుడు గత కొంతకాలంగా చెవి నొప్పితో బాధపడుతుండేవాడని, చెవి నొప్పి ఎక్కువ కావడంతో జీవితం మీద విరక్తి చెంది ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్