పులివెందుల: హార్టికల్చర్ కాలేజీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

71చూసినవారు
పులివెందుల మున్సిపల్ పరిధిలోని ఏపీసిఏఆర్ఎల్ క్యాంపస్ లో ఉన్న ప్రభుత్వ హార్టికల్చర్ కాలేజీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అసోసియేట్ డీన్ డాక్టర్ నాగరాజు తెలిపారు. కాలేజీ ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసి, నీటి ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్