వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని విద్యుత్ శాఖ ఏడీ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సింహాద్రిపురం మండలం గురిజాల సబ్ స్టేషన్లో రూ. 16లక్షలతో నిర్మించిన కెపాసిటర్ పవర్ బ్యాంకును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పవర్ బ్యాంకు వినియోగంపై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కరెంట్ బిల్లు ఇచ్చేటప్పుడు స్కానర్ పేపర్లో పూర్తిగా వచ్చేటట్లు చూడాలన్నారు.