సింహాద్రిపురం మండలం బలపనూరులో 2పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు తెలిపిన నేపథ్యంలో బుధవారం ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఫారెస్ట్ అధికారులతో కలిసి పొలాలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పొలాల్లో రైతులకు కనిపించిన గుర్తులు పులి, చిరుత పులివి కాదని, కేవలం జంగిల్ పిల్లి గుర్తులు అన్నారు. అయినా రైతులు పొలాలకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.