వేంపల్లిలో ముగ్గురు జూదరులు అరెస్ట్

66చూసినవారు
వేంపల్లిలో ముగ్గురు జూదరులు అరెస్ట్
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వేంపల్లె ఎస్సై రంగరావు హెచ్చరించారు. ఆదివారం సీఐ సురేష్ రెడ్డి ఆదేశాల మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరాలపై దాడులు చేశారు. వేంపల్లె పంచాయతీ పరిధిలోని చింతలమడుగుపల్లి గ్రామంలో జూదం ఆడుతున్న కొవ్వూరు గంగాధర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 6100 నగదును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్