వేంపల్లి మండలం నందిపల్లె వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వేముల నుంచి యర్లగోర్ల రమేశ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.