డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తాళ్లపల్లి పిహెచ్ సీ వైద్యురాలు డా. లక్ష్మీప్రియ వెల్లడించారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు డెంగ్యూ వ్యాధి నివారణకు ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూని ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే అంశాలపై ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేశారు.