వేంపల్లి: ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

57చూసినవారు
వేంపల్లి: ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జిల్లాలో ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎంపి అవినాష్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదు తో శుక్రవారం వేంపల్లెలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తనిఖీలు చేశారు. ఉపాధి కూలీ చెల్లింపు, మౌలిక సదుపాయాలపై కూలీలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉపాధి అధికారులకు కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్