వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గండి రోడ్డులోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న 47 మంది క్రియాశీలక సభ్యులతో మండల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పదవులు అలంకరించిన వారందరూ పార్టీ కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు.