అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామంలో రెవిన్యూ సదస్సు శుక్రవారం మండల మెజిస్ట్రేట్ నేతృత్వంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. సర్పంచ్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.