కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాడని రాజంపేట టిడిపి ఇన్చార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం గురువారము అన్నారు. అన్నమయ్య వీరబల్లి మండలంలోని మారుమూల గ్రామం కురవపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సుగవాసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.