చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి గ్రామం మలిశెట్టి మాధవయ్య కుమారుడు నరేంద్ర బైకు ప్రమాదంలో మరణించారు. బుధవారం వారి పార్థివ దేహానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, టిడిపి నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మలిశెట్టి మురళి గౌడ్, మలిశెట్టి రాహూల్, గుత్తి నరసింహ పాల్గొన్నారు.