ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు పంచాయతీలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, టిడిపి నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గురువారం ఇంటింటికి వెళ్లి వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెద్ది పెంచలయ్య, పయ్యావుల కోటేశ్వర నాయుడు, గాలి సురేష్, షేక్ రజువుల్లా పాల్గొన్నారు.