నందలూరు ఓబిలి గ్రామానికి చెందిన ఎస్. ప్రవీణ్ అనే యువకుడు క్యాన్సర్ చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, అతని మిత్రులు లయన్స్ క్లబ్‌కు సహాయం కోరారు. దానికి స్పందించి,మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. డాక్టర్ జయభాస్కరరావు, లయన్ మన్నెం రామమోహన్ క్యాన్సర్ అంగీకారం, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేసుకోవాలని తెలిపారు. .