ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామాలయం రెండు నెలలు మూత వేయనున్నట్లు టిటిడి ఆగమ అర్చకులు రాజేష్ బట్టర్ శుక్రవారం తెలిపారు. గర్భాలయంలో మరమ్మత్తుల్లో భాగంగా సెప్టెంబర్ 8 వతేది నుంచి మూత వేయడం జరుగుతుంది. అంత వరకు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో భక్తులకు దర్శన భాగ్యం ఉంటుందని వెల్లడించారు.