ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేరెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణ ఎనిమిదో తారీఖున నిర్వహించడం జరుగుతుందని ఒంటిమిట్ట ఎంఈఓ జి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఓటర్ల జాబితాను ఆయా పాఠశాలలో డిస్ప్లే చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికలను పకడ్బందీగా, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.