అన్నమయ్య జిల్లా రాజంపేటలో నెలకొన్న పరిస్థితులపై గురువారం రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు జమ్మర్తి జగన్మోహన్ రాజు ఒంటిమిట్టల సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందరూ కలిసి పని చేయాలని, సీఎం చంద్రబాబు ఇచ్చి నెరవేరుస్తున్న హామీలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని వారు టిడిపి నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట నరసయ్య, ఓబీనేని సుబ్బమ్మ, రఘురామిరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.