శ్రీ బద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో గీతా పారాయణం

54చూసినవారు
శ్రీ బద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో గీతా పారాయణం
ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం లో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం గీతా పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగుతుందని వారు తెలిపారు. శ్రీ బ్రహ్మీ భూత సద్గురు రామకృష్ణానంద స్వామి గండి క్షేత్రం వారిచే శ్రీ రామకృష్ణానంద గీతా సంఘం 41 వ వార్షికోత్సవం జరుగుతున్నదన్నారు. భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్