అంబులెన్స్ లోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేత

65చూసినవారు
అంబులెన్స్ లోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేత
సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామపంచాయతీ బంగారు పేట గ్రామానికి చెందిన కుచేలయ్య (75) అనే వ్యక్తికి గత3 రోజుల కిందట కడప చెన్నై రహదారి బంగారు పేట వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బలమైన గాయాలు తగిలాయి. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు 108 వాహనంలో తరించారు. కడప వైద్యాధికారుల సూచన మేరకు గురువారం ప్రత్యేక అంబులెన్స్ లో తిరుపతి సిమ్స్ కు తీసుకుంటూ ఉండగా మాధవరం వద్ద అంబులెన్స్ లోనే పెన్షన్ అందించారు.

సంబంధిత పోస్ట్