సిద్ధవటం: టపాసుల దుకాణం వద్ద ప్రమాదం జరగకుండా చూడాలి

51చూసినవారు
సిద్ధవటం: టపాసుల దుకాణం వద్ద ప్రమాదం జరగకుండా చూడాలి
టపాసులు అమ్మే దుకాణాల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద టపాసుల వర్తకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, దుకాణం వద్ద నీళ్లు, ఇసుక, అగ్నిమాపక పరికరం కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you