రాజంపేట: జాతీయ స్కేటింగ్ విజేతలకు సన్మానం

83చూసినవారు
రాజంపేట: జాతీయ స్కేటింగ్ విజేతలకు సన్మానం
రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీనివాసరాజు జాతీయ స్కేటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన రాజంపేట చిన్నారులైన ఎం. లక్ష్మీ స్నేహిత అండర్ 4, టి. శౌర్యసింహ అండర్ 6 ఆదివారం సత్కరించారు. మధురైలోని జాతీయ స్కేటింగ్ ఛాంపియన్స్ పోటీల్లో వీరు గోల్డ్ మెడల్ సాధించారు. వారిని అభినందించి ముందు ముందు ఇంకా ఎన్నో మన దేశానికి మెడల్స్ సాధించాలని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్