రాజంపేట మండలం బోడిగుంటపల్లి గ్రామంలో త్వరలో ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాజంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.