అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డీఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల సమయంలో రాజంపేట డీఎస్పీగా రావడం, ఎన్నికల సమయంలో తిరిగి తాడిపత్రి ఇన్చార్జి డీఎస్పీగా వెళ్లిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.