పనికి ఆహార పథకం (ఉపాధి హామీ) లో పనిచేసిన కార్మికులకు సుమారు 100 రోజులకు సంబంధించిన కూలీలు రాక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి బత్యాల చెంగల రాయుడు అన్నారు. ఆయన గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ & పవన్ కళ్యాణ్ ఓఎస్డి లను అమరావతిలో కలిశారు. వెంటనే ఉపాధి హామీ కూలీలను చెల్లించాలని వారిని కోరారు.