రామాపురం: ఉపాధి కల్పించాలని మంత్రిని కోరిన మహిళ

80చూసినవారు
రామాపురం: ఉపాధి కల్పించాలని మంత్రిని కోరిన మహిళ
రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రామాపురం మండలంలో పర్యటన సందర్భంగా శనివారం కుమ్మర‌పల్లి గ్రామానికి చెందిన మహిళ ఉపాధి కల్పించాలని మంత్రిని కోరింది. తన భర్త పూర్తిగా అనారోగ్యానికి గురి కావడంతో తమకు జీవనాధారం కష్టంగా ఉందని, తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని ఆమె మంత్రిని కోరింది. వెంటనే స్పందించిన మంత్రి ఆమెకు తప్పకుండా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్