అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు ములకలచెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. మండలంలోని దేవలచెరువుకు చెందిన సోమ్లా నాయక్ భార్య కమలమ్మ(60) అనారోగ్యం తాళలేక బుధవారం ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు ఆమెను మదనపల్లెకు తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటోంది.