ప్రభుత్వం ఆదేశాల మేరకు మే మాసం థీమ్ ఉష్ణాన్ని నివారించే విధంగా శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణ, తాగునీరు, ఉపాధి హామీ, పల్లె పండుగ పనుల ప్రగతిపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.