వైకాపా ప్రభుత్వంలో ప్రశ్నించిన బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు పెట్టి, నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లేదని, తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడు ఉసిరికాయ సిద్ధార్థ గౌడ్ మండిపడ్డారు. అభివృద్ధి అంశాల గురించి ప్రశ్నించినందుకు తనపై 10 కేసులు పెట్టి స్థానిక స్టేషన్లో రౌడీ షీట్ నమోదు చేసింది తమ ప్రభుత్వం కాదా అని రాయచోటిలో శుక్రవారం ప్రశ్నించారు.