వీరబల్లి మండలం మట్లి వడ్డేపల్లిలో తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1986లో కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్న భూమిని నకిలీ ఆన్లైన్ ప్రక్రియల ద్వారా కబ్జా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహాయం కోరుతూ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.