
కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగం: హరీష్ రావు
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదని మంగళవారం ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదన్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అవాస్తవాలు, అబద్ధాలతో నిండి ఉందని అన్నారు. అబద్ధాల ప్రచారానికి గవర్నర్‌ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని హరీష్ వ్యాఖ్యానించారు.