పెద్దమండెం మండలం వెలిగల్లు దగ్గర వెలసిన అభయ ఆంజనేయస్వామి గుడిలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలలు, తులసి దండలతో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యానికి ప్రతీక అని ఆయనను పూజించడం ద్వారా భక్తులు తమ జీవితంలోని కష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని పొందగలుగుతారని అర్చకులు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.