AP: రాజధాని అమరావతిపై కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే, మరో 30 వేల ఎకరాల మేర సమీకరించేందుకు సిద్ధం అయింది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు అయ్యే ప్రాజెక్టుల కోసం భూసమీకరణ చేయనుంది. ఇప్పటికే 33వేల ఎకరాల్లో నిర్మాణం పనులు ప్రారంభించిన సీఆర్డీఏ, రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనుంది.