పాక్‌కు అండగా నిలిచిన తుర్కియేకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ‘బాయ్‌కాట్ తుర్కియే’ పేరుతో భారతీయులు తుర్కియే వెళ్లడం మానుకున్నారు. మరోవైపు భారత యూనివర్సిటీలు తుర్కియేతో చేసుకున్న ఎంవోయూలను రద్దు చేసుకున్నాయి. తాజాగా లఖ్‌నవూలోని ఆభరణాల వ్యాపారులు తుర్కియే డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో ఆ దేశం నుంచి ఆర్డర్లు రద్దు చేసుకున్నారు.