ఏపీలో పెన్షన్ల జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్‌దారుడు మరణిస్తే అతడి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్‌దారుడు అక్టోబర్ 1 తర్వాత మరణిస్తే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని అతని భార్య అక్టోబర్ 15 లోపు గ్రామ, వార్డు సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేస్తే నవంబర్ నుంచి వింతతు పెన్షన్ వస్తుంది. అక్టోబర్15 తర్వాత అందజేస్తే డిసెంబర్ నుంచి వస్తుంది.