వల్లభనేని వంశీపై మరో కేసు

66చూసినవారు
వల్లభనేని వంశీపై మరో కేసు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.  గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ  గన్నవరం పీఎస్‌లో మరో కేసు నమోదు చేసింది. అలాగే అక్రమ తవ్వకాలపై నివేదికను ఏడీ అధికారులు పోలీసులకు అందించారు. ఆ నివేదికలో 2019 నుంచి 2024 వరకు వంశీ, అతని అనుచరుల అక్రమాల వివరాలు అందులో పొందుపరచినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్