AP: ఫార్చూన్ 500 కంపెనీ సీఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్నను బుధవారం మంత్రి నారా లోకేశ్ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. దానికి సిఫీ చైర్మన్ సుముఖత వ్యక్తం చేశారు. దాంతో ఏపీలో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అలాగే విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై మంత్రి లోకేశ్ చర్చించారు.