కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి.